Monday, April 14, 2025
Homeవిశ్లేషణమాటలకు, చేతలకు పొంతన లేని మోదీ!

మాటలకు, చేతలకు పొంతన లేని మోదీ!

నిత్యచక్రవర్తి
ఇండియాకు పొరుగున ఉన్న దేశంలో 2025 లో ముందుగా పర్యటిస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ఆకర్షణీయమైన నినాదాలు చేయడంలో మోదీ నిపుణుడు. ఆ నినాదం జరగొచ్చు, జరగకపోవచ్చు. దక్షిణాసియాలో పొరుగు దేశంతో ముందుగా కలుస్తానన్నారు. అంతేకాదు ఆగ్నేయాసియా దేశాలలోను, ఆసియా దేశాలలోను ముందుగా పర్యటిస్తానని చెప్పిన మోదీ తూర్పు దేశాలలో పర్యటించారు. బ్యాంకాక్‌లో బిమ్‌స్టెక్‌ (బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషీయేటివ్‌ ఫర్‌ మల్టి సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌) శిఖరాగ్ర సమావేశం జరిగింది. బిమ్‌స్టెక్‌ బ్రహ్మాండమైన వృద్ధిని సాధిస్తుందని మోదీ మాట్లాడారు. దక్షిణాదికి, పశ్చిమాసియాకు మధ్య కీలకమైన అంతరం ఉందని అన్నారు. బిమ్‌స్టెక్‌ సమావేశంలో ఆయన 21 పాయింట్లతో కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టారు. మరొక ప్రాంతీయ సంస్థ సార్క్‌ను మొదట ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు ఇండియా ఎస్‌సీవో, బ్రిక్స్‌ సంస్థలతో మోదీ సహకరించడం లేదు. బిమ్‌స్టెక్‌ నూతన ఛైర్మన్‌గా బంగ్లాదేశ్‌ బాధ్యతలను స్వీకరించింది. ప్రస్తుతం ఉన్న సూచనల ప్రకారం బంగ్లాదేశ్‌ జాతీయ ఎన్నికలు 2026 మధ్యలో జరగవచ్చు. తదుపరి బిమ్‌స్టెక్‌ శిఖరాగ్ర సమావేశం ఢాకాలో జరుగుతుంది. ఈ సమావేశానికి బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారు డాక్టర్‌ మహ్మద్‌ యూనస్‌ అధ్యక్షత వహించే అవకాశం ఎంతైనా ఉంది.
బిమ్‌స్టెక్‌ సమావేశం ముగిసిన తరువాత బ్యాంకాక్‌లో ఏప్రిల్‌ 4 న డాక్టర్‌ యూనస్‌తో మొదటి ద్వై పాక్షిక సమావేశానికి మోదీ హాజరయి చర్చలు జరిపారు. ఈ సమావేశం జరిగే వరకు భారతదేశం వైపు నుంచి సమావేశం జరిగేది లేనిది ధృవీకరణ లేదు. బ్యాంకాక్‌లో మొదటి ద్వై పాక్షిక సమావేశం జరగవచ్చునన్న సూచనలు మాత్రమే ఉన్నాయని బంగ్లాదేశ్‌ అధికారులు తెలిపారు. అయితే పూర్తి దౌత్యపరమైన నియమాలతో సమావేశం జరగవలసి ఉందని బంగ్లాదేశ్‌ అధికారులు అన్నారు. దౌత్య పరమైన నియమాలతో సమావేశం జరిగి ఉంటే భారతదేశానికి కొంచెం మంచి ఫలితాలు వచ్చేవి. డాక్టర్‌ యూనస్‌తో మన ప్రధాని మోదీ సమావేశం కావడం జాప్యం అయింది. అందుకు మోదీనే కారకుడు. అయితే మార్చి 26 నుంచి 29 వరకు జరిగిన పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో డాక్టర్‌ యూనస్‌ సమావేశం అయ్యారు. ముందుగా దిల్లీలో పర్యటించాలని అనుకున్న యూనస్‌ విదేశీ పర్యటనలో మొదటిసారి చైనాలో పర్యటించి జిన్‌పింగ్‌ను కలుసుకోవటం వలన అనంతరం మోదీతో మంచి స్థాయి నుంచి సమావేశం కాగలిగారు. ఈ సమావేశాని కంటే ముందు మన సౌత్‌ బ్లాక్‌ నేత మోదీ సక్రమంగా స్పందించ లేకపోయారు. బంగ్లాదేశ్‌లో 17 కోట్ల మంది ప్రజలుండగా వీరిలో ఎనిమిది శాతం హిందువులు ఉన్నారు. షేక్‌ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత ఆమె తప్పించుకుని ఇండియాకు చేరుకున్నారు. అనంతరం మైనారిటీల పైన (హిందువులు) దాడులు జరిగాయి. యూనస్‌ ప్రభుత్వం తగిన భద్రతా చర్యలను తీసుకుని మైనారిటీలను రక్షించాలని భారత ప్రభుత్వం క్రమం తప్పకుండా బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నది. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్దులు, క్రిస్టియన్లు కలిసి ఆ దేశ ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్రమంగా అక్కడ పరిస్థితి ప్రభుత్వ నియంత్రణలో ఉంది. తీవ్రవాదులు, మత ఛాందసవాదులపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఇండియా ప్రభుత్వం గట్టిగా కోరుతున్నది. డాక్టర్‌ యూనస్‌ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా బాధ్యతలు తీసుకొని ఎనిమిది నెలలకు పైగా గడిచింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సహకారం కొనసాగించేందుకు సమగ్ర కార్యక్రమాన్ని ఇండియా రూపొందించ లేకపోయింది. హసీనాను తమ దేశానికి పంపాలని డిమాండ్‌ చేయడంతో పాటు అనేక రాజకీయ సమస్యలు ఉన్నాయి. ఈ అంశం రెండు దేశాలకు తెలుసు. కొన్ని సమస్యలపైన తక్షణం దృష్టి పెట్టాలి.
ఈ విషయంలో ఇండియా సహకరించగలదు. ప్రధాన మంత్రి మోదీ ముందుగా డాక్టర్‌ యూనస్‌ను కలుసుకుని ఉంటే ఆయన చైనాలో పర్యటించి ఆర్థిక సహకారంతో పాటు ఇతర అంశాలలో చైనా సహకారాన్ని పొదగలిగేవారు కాదు. బంగ్లాదేశ్‌ అధికారులతో ఇండియా దూరంగా ఉంది. చైనా, పాకిస్తాన్‌లతో బంగ్లాదేశ్‌ మరింత సానుకూలమైన పంథాని ఏర్పర్చుకునే అవకాశం బంగ్లాదేశ్‌కు ఉంది. బంగ్లాదేశ్‌లో ప్రజలతో ఇప్పటికే సరైన సంబంధాలు లేక ఇండియా ప్రతిష్ట ముందుముందు మరింత తగ్గిపోతుంది. షేక్‌ హసీనా విషయంలో ఇండియా ఏం చేయనున్నదని అంశం స్పష్టంగా లేదు. హసీనా బంగ్లాలోని తన మద్దతుదారులతో ఇండియా నుంచి వీడియో ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. బ్యాంకాక్‌లో మోదీ, యూనస్‌లు సమావేశమైనప్పుడు హసీనా కార్యకలాపాలపై ప్రధానంగా చర్చించారు. హసీనాను ఇండియాలోనే ఉంచినట్లయితే బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వంపై దుష్ట ప్రచారాన్ని చేసే అవకాశం ఉందని అందువల్ల ఆమెను ఇండియాలోనే అట్టిపెట్టరాదని యూనస్‌ కోరుతున్నారు. తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని అత్యాచారాలకు పాల్పడిన వారి విషయం ఇప్పుడున్న అవామీలీగ్‌ మద్దతుదారులతో మాట్లాడతానని ఆ పార్టీ అవామీలీగ్‌కు హసీనా చెప్పారు. మోదీ యూనస్‌తో మాట్లాడినప్పుడు బంగ్లాదేశ్‌ ప్రజలతోను, ప్రభుత్వంతోను మాత్రమే సంబంధాలు పెట్టుకుంటామని అక్కడి ఏ రాజకీయ పార్టీ నాయకుడితోను లేదా పార్టీతోను సంబంధాలు పెట్టుకోబోమని యూనస్‌కి హామీ ఇచ్చారు. ఈ హామీ బంగ్లాదేశ్‌ ప్రజల మనసులను సానుకూలంగా మార్చవచ్చు. అయితే హసీనా ఇంకా ఇండియాలోనే ఉన్నందున ఇది ఎంతవరకు సాధ్యమో తెలియదు. మోదీ ప్రభుత్వానికి ఇదొక పెద్ద ప్రశ్నార్థకం. హసీనాను బంగ్లాదేశ్‌కి పంపించాలని యూనస్‌ చేసిన దౌత్యం విజయవంతం అయ్యింది. హసీనాకు సంబంధించి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వైఖరిని మానవ హక్కుల సంస్థలు సమర్థిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు