Friday, February 21, 2025
Homeఅంతర్జాతీయంమూడో ప్రపంచ యుద్ధం రావచ్చు!

మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు!

నేనున్నంత వరకు ఆ పరిస్థితి రానివ్వను: ట్రంప్‌

మియామీ: పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లో యుద్ధాల క్రమంలో మూడవ ప్రపంచ యుద్ధం రావడానికి ఎంతో సమయం పట్టబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అయితే దానిని నివారించేందుకు తమ ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందని చెప్పారు. తాను అధికారంలో ఉన్నంత వరకు ఇలాంటి పరిస్థితి రాబోదని దీమాగా చెప్పారు. ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రయారిటీ సమ్మిట్‌లో పాల్గొన్న ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ఆపి… శాంతి నెలకొల్పేందుకు ప్రపంచం చుట్టూ వేగంగా తిరుగుతున్నా నన్నారు. ‘రక్తం చిందడం… వ్యక్తులు చనిపోవడం నాకు నచ్చదు… నేను ఎప్పుడూ శాంతిని కోరుకుంటా. భూగోళం శాంతంగా ఉండటమే నాకు కావాలి. ఘర్షణలు, యుద్ధాలు కాదు. యుద్ధాలు జరిగితే ప్రాణఆస్తి నష్టం తప్ప ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఉద్రిక్తతల నడుమ మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేందుకు పెద్దగా సమయం పట్టబోదు. మరో ఏడాది పాటు జో బైడెన్‌ ప్రభుత్వం ఉంటే అదే జరిగేది. కానీ నేను అలా కాదు. ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితిని రానివ్వను’ అని ట్రంప్‌ ఉద్ఘాటించారు. అమెరికా, రష్యా మధ్య రాజీ కోసం చర్చలు జరిపినందుకుగాను సౌదీ అరేబియాకు డొనాల్డ్‌ ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి చర్చలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జెలెన్‌స్కీ ఓ నియంత... ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీపై ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. ఆయనను నియంతగా అభివర్ణించారు. జెలెన్‌స్కీని కమెడియన్‌గా వ్యవహరించారు. రష్యాఉక్రెయిన్‌ యుద్ధం క్రమంలో ఆ దేశానికి సంబంధించి అమెరికా వైఖరిలో మార్పు రావడానికి ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు అద్దంపట్టాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది. అవసరమైన నిధులతో పాటు ఆయుధాలు సమకూర్చింది. ‘ఎన్నికలు లేని నియంత జెలెన్‌స్కీ. ఆయన సత్వరమే చర్యలు తీసుకోకుంటే దేశమే ఉండదు’ అని ‘ట్రూత్‌’లో ట్రంప్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ చట్టం ప్రకారం యుద్ధ సమయంలో ఎన్నికలు ఉండవు.
జిన్‌పింగ్‌ అమెరికా వస్తారు…
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటిస్తారని ట్రంప్‌ దీమాగా చెప్పారు. జిన్‌పింగ్‌ మాత్రమే కాదు ప్రపంచ నాయకులంతా వస్తారన్నారు. అయితే జిన్‌పింగ్‌ పర్యటన గురించి ఆయన ఎలాంటి వివరాలను వెల్లడిరచలేదు. జిన్‌పింగ్‌ చివరగా 2023 నవంబరులో అమెరికాలో పర్యటించారు. చైనాతో వాణిజ్య ఒప్పందం సాధ్యమేనని ట్రంప్‌ చెప్పిన క్రమంలో జిన్‌పింగ్‌ పర్యటనపై వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది.
ఓడిపోతే జీవితం దుర్భరమయ్యేది…
ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన జీవితం దుర్భరమయ్యేదని ట్రంప్‌ అన్నారు. కేసులు చుట్టుముట్టి జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చేదన్నారు. ‘ఓడిపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. అది చాలా ప్రమాదకరం’ అని ఆయన వ్యాఖ్యానిం చారు. ‘వ్యక్తిగత సవాళ్ల నేపథ్యంలో మళ్లీ పోటీ చేసే ధైర్యం ఉండేది కాదేమో అని చెప్పారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టడం తనకు గర్వకారణమని ట్రంప్‌ అన్నారు. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్‌, అబ్రహాం లింకన్‌ చాలా అవమానాలు ఎదుర్కొన్నారని చరిత్ర చెబుతోందని గుర్తుచేశారు. దానిని ఒప్పుకోనన్నారు. నాతో ప్రవర్తించినంత ఘోరంగా ఎవరితోనూ ఎవరూ ప్రవర్తించి ఉండరని చెప్పారు. చాలా అవమానాలను ఎదుర్కోవల్సి వచ్చినట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు