Thursday, May 15, 2025
Homeవ్యాపారంయమహా బైక్‌లకు ఇప్పుడు 10 సంవత్సరాల ‘మొత్తం వారంటీ’

యమహా బైక్‌లకు ఇప్పుడు 10 సంవత్సరాల ‘మొత్తం వారంటీ’

ముంబయిః భారతదేశంలో తన 40 సంవత్సరాల మైలురాయిలో భాగంగా, యమహా మోటార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐవైఎం), భారతదేశంలో తయారు చేసిన మోటార్‌ సైకిళ్ళు, స్కూటర్ల శ్రేణి అంతటా 10 సంవత్సరాల మొత్తం వారంటీ కార్యక్రమాన్ని గురువారం ప్రకటించింది. ఈ చొరవ యమహా కొనసాగుతున్న ప్రీమియం బ్రాండ్‌ వ్యూహంలో కీలకమైన స్తంభాన్ని సూచిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఉన్నతమైన నాణ్యత, దీర్ఘకాలిక విశ్వసనీయత, పూర్తి మనశ్శాంతిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త 10 సంవత్సరాల మొత్తం వారంటీలో 2 సంవత్సరాల ప్రామాణిక వారంటీ మరియు ఇంధన ఇంజెక్షన్‌ (ఎఫ్‌ఐ) వ్యవస్థతో సహా ఇంజిన్‌, ఎలక్ట్రికల్‌ భాగాలను కవర్‌ చేసే అదనపు 8 సంవత్సరాల పొడిగించిన వారంటీ ఉన్నాయి. దీనితో, యమహా ద్విచక్ర వాహనాలు ఇప్పుడు దాని హైబ్రిడ్‌ స్కూటర్‌ శ్రేణి (రే జెడ్‌ఆర్‌ ఎఫ్‌ఐ, ఫాసినో 125 ఎఫ్‌ఐ), మ్యాక్సి-స్పోర్ట్స్‌ స్కూటర్‌ ఏరాక్స్‌ 155 వెర్షన్‌ %ూ% లకు 1,00,000 కి.మీ వరకు పరిశ్రమ-ప్రముఖ వారంటీ కవరేజీని పొందుతాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు