డబ్బు సంపాదనే మనిషి లక్ష్యం
భార్యాపిల్లల్నీ చేస్తాడు నిర్లక్ష్యం
తిండీ తిప్పలూ పట్టించుకోడు
కంటి నిండా నిద్ర కూడా పోడు
కన్న తల్లిదండ్రులు కన్నుమూసినా
కనికరం చూపని కొందరు కొడుకులు
ప్యాకేజీల రూపంలో కూలిడబ్బులిచ్చి
తలకొరివి పెట్టించే దౌర్భాగ్యులు
ఎంత సంపద ఉన్నా ఏం లాభం
తినడానికీ ఉండదులే సమయం
ఒంటికి సోకాక ఏదో ఒక మాయరోగం
అసలు తినడానికే ఉండదు యోగం
ఒత్తిడిని జయించడానికి ఉందొక దారి
కుటుంబంతో సరదాగా గడిపితే సరి
మాంత్రికాలు..తాంత్రికాలు ఎన్ని చేసినా
యాంత్రికం కాకూడదు మానవ జీవితం!
శర్మ సీహెచ్., 9440587567