Wednesday, May 14, 2025
Homeఅంతర్జాతీయంయువతను ఈడ్చుకెళ్లి చేరుస్తున్నారు

యువతను ఈడ్చుకెళ్లి చేరుస్తున్నారు

ఉక్రెయిన్‌ సైనిక నియామకాలపై పుతిన్‌
మాస్కో: ఉక్రెయిన్‌, రష్యా మధ్య శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. ఇలాంటి సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌ సైన్యం తీరును తీవ్రంగా విమర్శించారు. దేశ ప్రజలను బలవంతంగా సైన్యంలో చేరుస్తున్నట్లు ఆరోపించారు. బిజినెస్‌ రష్యా ఆర్గనైజేషన్‌ సమావేశంలో ఉక్రెయిన్‌ను పుతిన్‌ దుయ్యబట్టినట్లు స్పుత్నిక్‌ వార్తాసంస్థ పేర్కొంది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న వాలంటీర్ల సంఖ్య పెరుగుతోందని పుతిన్‌ చెప్పారు. తమ సైన్యం భయపెట్టదని, స్వచ్ఛందంగా చేర్చుకుంటోందన్నారు. సైన్యంలో చేరేందుకు ఉక్రెయిన్‌ యువత ఆసక్తి కనబర్చడం లేదని, రష్యాలో అందుకు భిన్న పరిస్థితి ఉందని చెప్పారు. కీవ్‌ అధికారులు ప్రజలను వీధి శునకాల వలే ఈడ్చుకెళ్లి సైన్యంలో చేరుస్తున్నారు. ఉక్రెయిన్‌లో 30,000 మందిని ఇదే పద్ధతిలో తీసుకెళ్లారు. రష్యాలో యువత స్వచ్ఛందంగా సైన్యంలో చేరేందుకు వస్తారు. దాదాపు 60,000 మంది ముందుకొచ్చారు’ అని పుతిన్‌ వెల్లడిరచారు. ఇదిలావుంటే, ఉక్రెయిన్‌`రష్యా మధ్య యుద్ధం క్రమంలో 18-60 ఏళ్ల మధ్య వయస్సుగల పురుషులు దేశం వీడరాదని రష్యా ఆదేశించింది. 27 ఏళ్ల వారు తప్పనిసరిగా సైన్యంలో చేరాలని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌… నిర్బంధ చేరికల వయస్సును 25ఏళ్లగా నిర్ణయించింది. ఉక్రెయిన్‌లో సైనిక నియామకాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అభ్యర్థులను పోలీసులు వెంటాడం వీధిపోరాటాలకు దారి తీస్తున్నది. బస్సుల్లో ఎక్కి బలవంతంగా తరలిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు