ట్రంప్, మస్క్ ఆగ్రహం
వాషింగ్టన్: యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. అది ఓ నేర సంస్థ అని మస్క్ దుయ్య బట్టగా… దానిని రాడికల్ మూర్ఖులు నడుపుతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అటువంటి వారిని తొలగించి, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై తాను నిర్ణయం తీసుకుంటానని అధ్యక్షుడు వెల్లడిరచారు. అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో యూఎస్ ఎయిడ్ విదేశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తుంటే… వారు ఆ డబ్బుతో కోవిడ్ వంటి ప్రమాదకర వ్యాధులు పుట్టించడానికి పరిశో ధనలు చేస్తున్నారని మస్క్ ఆరోపిం చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాలకు అమెరికా అందించే అన్నిరకాల సాయాన్ని 90 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేసిన విషయం తెలిసిందే. విదేశాలకు అందించే సాయం అమెరికా విధానాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది వారు సమీక్షి స్తున్న నేపథ్యంలో యూఎస్‌ఎయిడ్ పనితీరుపై వారు విమర్శలు గుప్పించడం ప్రాధాన్యం సంతరిం చుకుంది. వృథా ఖర్చులు తగ్గిం చడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పడిన డోజ్ విభాగానికి… వేతనాలకు సంబంధించిన ట్రెజరీ యాక్సెస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో యూఎస్‌ఎయిడ్‌కు ప్రభుత్వం నుంచి అందే నిధులపై కత్తెర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కిందకు తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయాన్ని మూసివేయాల్సిందిగా యూఎస్‌ఎయిడ్ తన సిబ్బందిని ఆదేశించింది.
యూఎస్‌ఎయిడ్ ఓ నేర సంస్థ
RELATED ARTICLES