Tuesday, April 22, 2025
Homeఅంతర్జాతీయంరాజకీయ ఖైదీలను విడిచిపెట్టండి

రాజకీయ ఖైదీలను విడిచిపెట్టండి

గొలుసులతో కట్టేసుకొని కొలంబియా వర్సిటీ వద్ద నిరసన
న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళ చేశారు. తమ రాజకీయ ఖైదీలను బేషరతు విడుదలకు డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలిచ్చారు. 10 మంది ప్రదర్శనకారులు తమకు తాముగా కొలంబియా వర్సిటీ గేట్లకు గొలుసులతో కట్టేసుకొని నిరసన తెలిపారు. పలస్తీనా విద్యార్థి కార్యకర్తలు ఇద్దరిని ఇమ్మిగ్రేషన్‌ Ê కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ (ఐసీఈ) నిర్బంధించడాన్ని వ్యతిరేకించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గేటు వద్ద ధర్నా నిర్వహించారు. కొలంబియా స్కూల్‌ ఆఫ్‌ జనరల్‌ స్టడీస్‌లో ఫిలాసపీ అండర్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మోసీన్‌ మద్వానీని ఐసీఈ గత వారం కస్టడీలోకి తీసుకుంది. అలాగే స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ గ్రాడ్యుయేట్‌ మహమూద్‌ ఖలీల్‌ను ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు గతనెలలో నిర్బంధించారు. ఈ ఇద్దరు కార్యకర్తలు కొలంబియాలోని పలస్తీనా అనుకూల ప్రదర్శనలను నిర్వహించారు. మద్వానీ, ఖలీల్‌ విడుదలకు ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ‘మా రాజకీయ ఖైదీలు అందరినీ విడుదల చేయండి’, ‘మాకు న్యాయం కావాలి. అది ఎలాగో మీరు చెప్పండి’ మోసీన్‌ మద్వానీని తక్షణమే విడుదల చేయండి’ అన్న ప్లకార్డులతో ప్రదర్శనకారులు నినాదాలు చేశారు. లూసియానా, జెనాలోని నిర్బంధ కేంద్రం నుంచి ఖలీల్‌ రాసిన రాతలను చదవి వినిపించారు. ఈ నిరసన క్రమంలో జరిగిన ఉల్లంఘనలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కొలంబియా అధికార ప్రతినిధి చెప్పారు. ఇది చిన్నపాటి ఆటంకం అని, విద్యార్థులు యధావిథిగా తరగతులకు హాజరయ్యారని, అన్ని కార్యకలాపాలు షెడ్యూల్‌ ప్రకారం జరిగాయన్నారు. ఈ నిరసనతో చాలా మందిని అదుపులోకి తీసుకున్నట్లు న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. అయితే ఎంత మందిని అరెస్టు చేశారు. వారిపై తీసుకునే చర్యలు ఏమిటో వెల్లడిరచలేదు. కాగా, కొలంబియా గేట్లను నిరసనకారులు గొలుసులతో కట్టేసుకొని నిరసన తెలుపడటం ఈ నెలలో రెండవ సారి జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు