Homeక్రీడలురింకూ సింగ్ ఇంట విషాదం

రింకూ సింగ్ ఇంట విషాదం

- Advertisement -

న్యూదిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ రింకూసింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖంచంద్ర సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖంచంద్ర సింగ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఉన్న రింకూసింగ్, ఇటీవల తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో జట్టును వీడి వెళ్లాడు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు తండ్రిని పరామర్శించి… మ్యాచ్ జరిగే రోజు ఉదయం తిరిగి జట్టుతో కలిశాడు. అయితే ఆ మ్యాచ్ తుది జట్టులో రింకూసింగ్‌కు చోటు దక్కలేదు. ఆయన స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించారు. తండ్రి మరణవార్త తెలియడంతో రింకూ సింగ్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు