ముంబయి: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, 2024 క్యాలెండర్ సంవత్సరంలో తమ టెలివిజన్ వ్యాపారం 10000 కోట్ల రూపాయల అమ్మకాలను అధిగమించిందని సోమవారం వెల్లడిరచింది. దీనితో భారతదేశంలో టెలివిజన్ పరిశ్రమలో ఈ ముఖ్యమైన మైలురాయిని సాధించిన మొదటి బ్రాండ్‌గా సామ్‌సంగ్ అవతరించింది. ప్రీమియం టీవీల విస్తృతమైన పోర్ట్‌ఫోలియో, పెద్ద-స్క్రీన్, ఏఐ-శక్తివంతమైన టెలివిజన్‌లకు పెరుగుతున్న డిమాండ్ ద్వారా 2025లో రెండంకెల వృద్ధిని సాధించగలమనే నమ్మకాన్ని సామ్‌సంగ్ తెలిపింది. సామ్‌సంగ్ ఇండియాకు ఒక మైలురాయి సంవత్సరంగా 2024 నిలుస్తుందని, విలువ పరంగా, రూ.10000 కోట్ల టర్నోవర్‌ను సాధించామని సామ్‌సంగ్ ఇండియా విజువల్ డిస్‌ప్లే బిజినెస్ సీనియర్ డైరెక్టర్ విప్లేష్ డాంగ్ అన్నారు. తమ కొత్త ఏఐ టీవీ శ్రేణి ద్వారా ఇప్పుడు ఈ సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధించాలని కోరుకుంటున్నట్లు సామ్‌సంగ్ ఇండియా విజువల్ డిస్‌ప్లే బిజినెస్ సీనియర్ డైరెక్టర్ విప్లేష్ డాంగ్ అన్నారు.