ముంబయి: భారతదేశంలోని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అగ్రగామి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ఐకెఎఫ్ ఫైనాన్స్ తాజాగా నోర్వెస్ట్, మోతీలాల్ ఓస్వాల్ అల్టర్నేట్స్ (ఎంఓ అల్టర్నేట్స్)ల నుండి సుమారు రూ. 1,465 కోట్ల పెట్టుబడి సంపాదించినట్టు ప్రకటించింది. ఈ లావాదేవీలో ప్రాధమిక పెట్టుబడి, ద్వితీయ వాటా అమ్మకం రెండూ ఉన్నాయి. 1991లో వీ.జీ.కే. ప్రసాద్ స్థాపించిన ఐకెఎఫ్ ఫైనాన్స్ 30 ఏళ్లకు పైగా గల విశ్వసనీయ క్రెడిట్ పనితీరుతో భారతదేశంలో ప్రముఖ ఎన్.బి.ఎఫ్.సి.గా ఎదిగింది. రెండవ తరానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్తలైన కే. వాసుమతి దేవి, వసంత లక్ష్మి వరుసగా ఐకెఎఫ్ ఫైనాన్స్, ఐకెఎఫ్ ఫైనాన్స్‌ను నడిపిస్తున్నారు. 9 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఐకెఎఫ్ వాణిజ్య వాహనాలు రిఫర్ చేసిన లోన్లు, ఎం.ఎస్.ఎం.ఇ. లోన్లు వంటి భద్రత కలిగిన రిటైల్ లోన్లు అందిస్తోంది.