కీవ్: ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి తెర దించే కసరత్తు ముమ్మరమైంది. రెండు దేశాల అధినేతలు శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ నిర్ణయించుకున్నారు. నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసేందుకు ఆయన సిద్ధమయ్యారు. పుతిన్‌జెలెన్‌స్కీ మధ్య జరగబోయే కీలక చర్చలకు టర్కీలోని ఇస్తాంబుల్ వేదిక అయింది. రష్యా బృందంతో జెలెన్‌స్కీ గురువారం భేటీ అవుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడికి సలహాదారు మంగళవారం వెల్లడిరచారు. ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరుగుతాయని తెలిపారు. ఉక్రెయిన్
రష్యా శాంతి చర్చల్లో పాల్గొంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఈ చర్చలు ఏ స్థాయిలో జరుగుతాయో రష్యా స్పష్టత ఇవ్వలేదు.