Monday, May 12, 2025
Homeతెలంగాణరైతులకు పూర్తిస్థాయి రుణమాఫి

రైతులకు పూర్తిస్థాయి రుణమాఫి

మంత్రి తుమ్మలకు సీపీఐ నేతల వినతి

విశాలాంధ్ర- హైదరాబాద్‌ : రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈ.టి. నరసింహతో కలిసి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సోమవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ అమలుకు చర్యలు తీసుకున్నారని, అయితే ఇంటి యజమాని, అతడి భార్య, కుమారుడు, కోడలు వేర్వేరుగా బ్యాంక్‌ నుంచి పంటరుణం తీసుకున్నారని, అవి మొత్తం రూ.రెండు లక్షలకుపైబడి ఉన్నాయని, కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకున్నందున దాదాపు 40 శాతం పైబడి రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేపట్టి విడుతల వారిగా అమలు చేసినందున రైతులపై వడ్డీ భారం పడిరదన్నారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలో అర్హులు 9,588 మంది ఉండగా 5,864 మందికే రుణమాఫీ అయిందని, మిగిలిన 3,724 మంది రుణమాఫీ పెండిరగ్‌లో ఉండటంలో రైతులు బ్యాంక్‌లు… వ్యవసాయ అధికారి కార్యాలయాల చుట్టు తిరిగి విసిగి వేసారి పోతున్నారన్నారు. మరికొందరు రైతులకు అసలు, వడ్డీ కలిపినందున రెండులక్షలకు పైబడి బాకీ ఉన్నట్లు చూపించడంతో వారికి కూడా మాఫీ కాలేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మరోవైపు జూన్‌లో కాపు లోన్‌లు రెన్యూవల్‌ చేసుకుంటే రుణమాఫీ అయ్యే అవకాశముండదేమో అనే మీమాంసలో రైతులు రెంటికి చెడ్డ రేవడి లాగా అంతర్మథనం పడుతున్నారన్నారు. సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపాలని మంత్రిని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు