ఇస్లామాబాద్: లాహోర్‌లో పాక్ మోహరించిన హెచ్‌క్యూ 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడార్లను భారత్ ధ్వంసం చేయడంతో అమెరికా ఒక్కసారిగా అప్రమత్తమైంది. తమ దేశ పౌరులు ఎవరైనా ఉంటే తక్షణమే లాహోర్‌ను విడిచి వెళ్లిపోవాలని అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు పాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నగరంలో పేలుళ్లు, డ్రోన్ల కూల్చివేతలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పేర్కొంది. తమ సిబ్బందిని షెల్టర్‌లోకి తరలించినట్లు వెల్లడిరచింది. బుధవారం రాత్రి పాకిస్థాన్ భారత్‌లోని 15 నగరాలు లక్ష్యంగా దాడులు మొదలుపెట్టడంతో భారత్ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని సకాలంలో అడ్డుకొన్నాయి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. నేటి ఉదయం నుంచి పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకొంటుండంతో తీవ్ర గందరగోళం నెలకొంది. యుద్ధ భయంతో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్‌ఛేంజి 7 శాతం పతనమైంది. దీంతో ట్రేడిరగ్‌ను కొద్దిసేపు ఆపేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400 రంగంలోకి దిగింది. నిన్నరాత్రి పాక్ ప్రయోగించిన చాలా ఆయుధాలను ఇది నిర్వీర్యం చేసింది. తాజాగా రావల్పిండిలోని క్రికెట్ మైదానంలో కూడా పేలుడు జరిగినట్లు సమాచారం. ఇక్కడ రాత్రికి జరగాల్సిన పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ వాయిదా పడిరది. గురువారం మధ్యాహ్నం కరాచీ, గుజ్రాన్‌వాలా, చక్వాల్, అట్టోక్, కరాచీ, చోర్, బహవల్పూర్, మినవాలి…తదితర ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కానీ, వీటిపై భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్ వెన్నులో వణుకుపుట్టించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడిరది. దీని తర్వాత పాకిస్థాన్ భారత్‌లోని 15 నగరాలపై దాడి చేసేందుకు యత్నించింది. దీనిని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకుని పాక్ దాడిని భగ్నం చేసింది. మరోవైపు, కౌంటర్ అటాక్‌గా భారత్… లాహోర్‌లోని పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని సర్వనాశనం చేసింది. గురువారం ఉదయం లాహోర్ కంటోన్మెంట్‌కి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయిల్ తయారీ హార్పి డ్రోన్స్ పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. పాక్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏం చేయాలో తెలియక లాహోర్, కరాచీ, సియాల్‌కోట్ విమానాశ్రయాలు మూసేసింది. మరోవైపు, రాజధాని ఇస్లామాబాద్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే, లాహోర్‌ను వెంటనే విడిచి వెళ్లాలని అమెరికా తన ప్రజలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ దాడులు ఇందుకు కారణమని తెలుస్తోంది. లాహోర్ ప్రధాన విమానాశ్రయం సమీపంలోని ప్రజల్ని పాక్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారనే సమాచారం పాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అందింది. లాహోర్‌లో ఉన్న అమెరికన్లు వెంటనే నగరాన్ని విడిచివెళ్లాలని, సాధ్యం కాకపోతే షెల్టర్‌లో ఉండాలని ఆదేశించింది.
లాహోర్‌ను వీడండి: అమెరికా
RELATED ARTICLES