Homeవ్యాపారంవడదెబ్బ నివారణకు ఏఐజి హాస్పిటల్స్ “బీట్ ది హీట” అవగాహన ప్రచారం

వడదెబ్బ నివారణకు ఏఐజి హాస్పిటల్స్ “బీట్ ది హీట” అవగాహన ప్రచారం

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన వేసవి పరిస్థితులు నెలకొని, ఇటీవల హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే bక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, వడదెబ్బ, వేడి సంబంధిత అనారోగ్యాలు, ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ప్రథమ చికిత్స మరియు నివారణ చర్యలపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏఐజి హాస్పిటల్స్, బంజారా హిల్స్ “బీట్ ది హీట” అనే భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అడపాదడపా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, వడదెబ్బ ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వాతావరణ హెచ్చరికలు నొక్కి చెబుతున్నాయి. ఏఐజి హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, అవగాహన ఉంటే నేరుగా ప్రాణాలను కాపాడగల వైద్య అత్యవసర పరిస్థితులలో వడదెబ్బ ఒకటి. చాలా మంది ఇప్పటికీ వేడి సంబంధిత అనారోగ్యాన్ని కేవలం డీహైడ్రేషన్ లేదా అలసటగా భావిస్తారు, కానీ వాస్తవానికి, ఇది మెదడు, గుండె, మూత్రపిండాలు, ఇతర కీలక అవయవాలను వేగంగా ప్రభావితం చేయగలదు. ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించి, బలహీనంగా ఉన్న కుటుంబ సభ్యులను ర¿ాìంచుకుని, మొదటి కొన్ని నిమిషాల్లోనే సరైన చర్యలు తీసుకునేలా ప్రజలకు సహాయం చేయడమే మా లక్ష్యం” అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు