Saturday, February 22, 2025
Homeహైదరాబాద్వసతి గృహాల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

వసతి గృహాల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

విశాలాంధ్ర ` షాద్‌ నగర్‌,రూరల్‌ : వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే ఎప్పుడు పేద విద్యార్థుల పేద ప్రజల విద్యా, వైద్యం పైనే ఎందుకంటే నిరుపేద కుటుంబం నుంచి కష్టపడి అంచలంచలుగా ఎదిగి ఎమ్మెల్యేగా అయ్యాడు రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌ వీర్లపల్లి శంకర్‌ ఎప్పుడు పేద విద్యార్థుల భవిష్యత్తుపై పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే ఎమ్మెల్యే ఆయననే అని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. షాద్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 740 మంది పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ ఆకలి తీర్చే అన్నదాతలా మారాడు.
అదేవిధంగా బుధవారం షాద్‌నగర్‌ పరిధిలోని కొందుర్గ్‌ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేసి విద్యార్థులతో కలిసి నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాలతో పాటు సంక్షేమ వసతి గృహాలలో చదువులు కొనసాగించే పేద విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని అది వారి భవిష్యత్తు పెట్టుబడి అని అదే రీతిలో విద్యార్థులు బాగా చదువుకోని తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని వారు భవిష్యత్తు శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి పురుషోత్తం, చెన్నయ్య, విక్రమ్‌రెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు