డబ్ల్యూహెచ్‌ఓ సూచించిన ఏక్యూ ఆ ఏడు దేశాల్లోనే…
సింగపూర్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) సూచించిన వాయు నాణ్యతా ప్రమాణాలను (ఎక్యూఐ) ఏడు దేశాలు మాత్రమే చేరుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది. చాద్, బంగ్లాదేశ్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవిగా స్విస్ వాయు నాణ్యతా పర్యవేక్షణ సంస్థ ఐక్యూఎయిర్ తేల్చింది. వాయు కాలుష్య స్థాయిలు డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకాల కంటే 15 రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొంది. చాద్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ తర్వాత ఐదవవ స్థానంలో భారత్ నిలిచినట్లు తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బహమాస్, బార్బడోస్, గ్రెనడా, ఎస్టోనియా, ఐస్లాండ్ దేశాలు మాత్రమే ఈ గ్రేడ్‌లో ఉన్నాయని ఐక్యూఎయిర్ పేర్కొంది. 2024 డేటా ఆధారంగా ఈ మేరకు మంగళవారం నివేదించింది.
కాగా, 2022తో పోలిస్తే భారత్‌లో సగటు పీఎం 2.57 శాతం తగ్గి 50.6 ఎంజీ/క్యూ.ఎంకి చేరుకుందని తెలిపింది. డబ్ల్యుహెచ్‌ఓ 5 ఎంజీ/సియు.ఎం కంటే ఎక్కువ స్థాయిలను సిఫార్సు చేయగా, గతేడాది 17 శాతం నగరాలు మాత్రమే దీనిని చేరుకోగలిగాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఆగేయాసియా, దక్షిణ అమెరికాలో కార్చిచ్చులు సంభవిస్తున్నట్లు ఐక్యూఎయిర్ మేనేజర్ చెస్టర్ వెల్లడిరచారు.