విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 6400 కోట్ల బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ఉన్నత చదువుకు శాతంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎసఎఫ్ నాయకుడు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో సి ఆర్ భవనం నుండి కలెక్టరేట్ కార్యాలయం వద్ద కు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు..ఈ సందర్భంగా ఏఐఎసఎఫ్ జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి డి.సోమన్న, యస్ షాబీర్ భాష లు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఏఐఎసఎఫ్ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోందన్నారు, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుంటే ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడం దురదృష్టకరం. విద్యార్థుల చదువులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారి భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. యువగలం పాదయాత్రలో మన ప్రభుత్వ అధికారంలోకి వస్తేనే వందరోజుల్లో జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేటికి ఈ అంశం పైన విద్యాశాఖ మంత్రి ఏ మాత్రం కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6400కు పైగా విడుదల చేయాలన్నారు ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న కుమారికి వినతిపత్రం అందజేశారు .ఈ కార్యక్రమంలో ఏఐఎసఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ రంగస్వామి, శరత్ కుమార్ , దస్తగిరి, నగర అధ్యక్ష కార్యదర్శి అభిరామ్, అశోక్, నాయకులు శేఖర్, అల్తాఫ్, శ్రీకాంత్, హాజీ, సుధాకర్, అఖిల్ , ఉమామహేశ్వరి, రాజేశ్వరి, భార్గవి, వీరేష్, మహేష్, విద్యార్థిని విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో విద్యా శాఖ మంత్రి చెలగాటమాడొద్దు
- Advertisement -
RELATED ARTICLES


