ముంబయి: వినూత్న గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా తన %ప% సిరీస్‌కు మరో అద్భుతమైన అదనంగా వీ50ని ఆవిష్కరించింది. వివో వీ50 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ కేటగిరీ1లో భారతదేశంలో అత్యంత సన్నని (0.739 సెం.మీ) స్మార్ట్‌ఫోన్, అల్ట్రా-స్లిమ్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న మొట్టమొదటి వీ సిరీస్ స్మార్ట్‌ఫోన్. సెగ్మెంట్-లీడిరగ్ పోర్ట్రెయిట్ అనుభవాన్ని అందించే వీ-సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, వీ50 జెయిస్ కో-ఇంజనీరింగ్ ఇమేజింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. వివో11 నిర్వహించిన అంతర్గత అధ్యయనం ప్రకారం, భారతదేశంలో జరిగే వివాహాలలో ఏటా 2 బిలియన్లకు పైగా ఫోటోలు రూ.25,000 కంటే ఎక్కువ ధర గల స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి తీయబడుతున్నాయి. దీని నుండి ప్రేరణ పొందిన వివో, భారతదేశం-ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్2ను ప్రవేశపెట్టింది. వివో వీ50 ధర 8జీబీG128జీబీ వేరియంట్‌కు రూ.34,999, 8జీబీG256జీబీ వేరియంట్‌కు రూ.36,999, 12జీబీG512జీబీ వేరియంట్‌కు రూ.40,999, ఫిబ్రవరి 25 నుండి వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్‌లలో అమ్మకం ప్రారంభమవుతుంది.