. రైతులకు సంవత్సరానికి రూ.20 వేలు
. అన్నదాత సుఖీభవకు రూ.9,400 కోట్లు
. ఉచిత పంటల బీమాకు రూ.1,023 కోట్లు
. కొన్నింటికి అరకొర కేటాయింపులే…
. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 202 5
26 సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ తదితర 20 విభా గాల్లో బడ్జెట్‌ను రూపొందించారు. శాసన సభలో వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు, శాసన మండలిలో మంత్రి పి.నారాయణ వేర్వేరుగా ప్రవేశపె ట్టారు. అసెంబ్లీలో రూ.48,341.14 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడుతూ, ప్రధాన వనరు అయిన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి వెల్లడిరచారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడిరచారు. వికసిత్ భారత్ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళతామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. వ్యవసాయ బడ్జెట్‌లో మొత్తం రూ.48,341.14 కేటాయించగా, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు కేటాయించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్ పజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్‌ఎఫ్) ద్వారా ఇప్పటికే 10.68 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేపట్టాయి. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి 3 వేల కొత్త గ్రామ పంచాయతీలలోని 2,570 క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోనికి తీసుకురానున్నారు. 2025
26లో 7,116 గ్రామ పంచాయతీలలో పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) ను, 365 రోజులు గ్రీన్‌కవర్, ఏడాది పొడవునా ఆదాయాన్ని అందించే ఏగ్రేడ్ ఏటీఎం మోడళ్లను, వివిధ రసాయన రహిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ
పీఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వ సాయం రూ.6 వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20 వేల చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందిస్తారు. భూమి లేని కౌలు రైతులకు మొత్తం రూ.20 వేల ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇస్తారు. అన్నదాత సుఖీభవపీఎం కిసాన్ పథకం అమలుకు 2025
26 బడ్జెట్‌లో రూ.9,400 కోట్లు ప్రతిపాదించారు. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఆశించినంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవకు కోత విధించారు. కౌలు రైతులను పూర్తిగా విస్మరించారు.
వ్యవసాయ బడ్జెట్… కేటాయింపులిలా…
. విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు
. ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు
. ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు
. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు
. రైతులకు వడ్దీ లేని రుణాల కింద రూ.250 కోట్లు
. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు
. ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
. వ్యవసాయ శాఖకు రూ.12,401.58 కోట్లు
. ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు
. పట్టు పరిశ్రమకు రూ.96.22 కోట్లు
. సహకార శాఖకు రూ.239.85 కోట్లు
. పశు సంవర్థక శాఖకు రూ.1,112.07 కోట్లు
. మత్స్య రంగానికి రూ.540.19 కోట్లు
. ఎన్జీ రంగా వర్సిటీకి రూ.507.01 కోట్లు
. వైఎస్‌ఆర్ వర్సిటీకి రూ.98.21 కోట్లు
. ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు
. ఏపీ ఫిషరీస్ వర్సిటీకి రూ.38 కోట్లు
. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773.25 కోట్లు
. ఉపాధి హామీకి రూ.6,026.87 కోట్లు
. ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు
. నీటి వనరుల శాఖకు రూ.12,903.41 కోట్లు