అమెరికాకు ఇరాన్ ప్రశ్న
తెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో శాంతి చర్చల్లో పురోగతి కోసం ఇరాన్ తన వంతు ప్రయత్నం కొనసాగుతోంది. ఇప్పటికే 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే అవి తనకు నచ్చలేదని, తాము చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో తెహ్రాన్ తీవ్రంగా స్పందించారు. తాము పెట్టిన షరతులకు ఒప్ప్పుకుంటారా లేక ఓటమిని అంగీకరిస్తారా అంటూ అమెరికాకు సవాల్ విసిరింది. ఇరాన్ ప్రధాన మధ్యవర్తి మహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ స్పందిస్తూ తెహ్రాన్ హక్కులను వాషింగ్టన్ కాదనలేదని చెప్పారు. రెండు నెలలకుపైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించాలని అమెరికా భావినట్లయితే తమ ప్రతిపాదనలకు అంగీకారం తెలపాలని సూచించారు. గతనెలలో ఎలాంటి ఫలితం లేకుండా మొదటి దఫా చర్చల తర్వాతే శాంతి చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొన్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదన చెత్తగా ఉన్నదంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనను బేషరతుగా తిరస్కరించారు. దీంతో శాంతి చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. అయితే లెబనాన్ సహా అన్ని చోట్ల యుద్ధాన్ని పూర్తిగా ముగించాలన్నది ఇరాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. హోర్మూజ్ జల సంధిపై సార్వభౌమత్వం, యుద్ధ నష్టానికి పరిహారం కూడా కోరుతోంది. అమెరికా నావికా దిగ్బంధనం ముగింపు సహా అనేక షరతులు పెట్టింది. అమెరికా మాత్రం తమ మాటే చెల్లాలన్న మంకుపట్టుదలతో వ్యవహరిస్తోందని ఇరాన్ విమర్శించింది.
షరతులు అంగీకారమేనా లేక…
- Advertisement -
RELATED ARTICLES


