Tuesday, February 25, 2025
Homeసవాళ్లు…ప్రతి సవాళ్లు

సవాళ్లు…ప్రతి సవాళ్లు

. మండలిలో మాటల యుద్ధం
. టీడీపీ`వైసీపీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ
. వీసీలపై ఒత్తిడితోనే రాజీనామాలు: వైసీపీ
. ఆధారాలతో నిరూపించగలరా? లోకేశ్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మంగళవారం టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పరస్పర సవాళ్లతో మండలి వేడెక్కింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా కూటమి, వైసీపీ సభ్యుల మధ్య రగడ జరిగింది. అలాగే ఉద్యోగాల కల్పన అంశంపై వైసీపీటీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌ ప్రసంగంలో తెలుగు, ఇంగ్లీష్‌ ప్రచురణల మధ్య తేడా ఉందంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం దూషణలకు దిగడంతో గందరగోళం నెలకొంది. పరిస్థితిని అందుపులోకి తెచ్చేందుకు చైర్మన్‌ మోషెనురాజు మండలిని ఒకసారి వాయిదా వేయాల్సి వచ్చింది. తొలుత మండలి ప్రారంభంకాగానే ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ వైసీపీ సభ్యులు తూమాటి మాధవరావు, కుంభా రవిబాబు, బొమ్మి విశ్వరాయలు వాయిదా తీర్మానం ఇవ్వగా…దాన్ని చైర్మన్‌ తిరస్కరించారు. దీంతో చైర్మన్‌ పొడియం వద్దకు వైసీపీ ఎమ్మెల్సీలు వెళ్లి కొద్దిసేపు నిరసన తెలిపారు. వారి నిరసనల నడుమే…గవర్నరు ప్రసంగ తీర్మానంపై టీడీపీ సభ్యులు తిరుమలనాయుడు, పి.అశోక్‌బాబు, పంచుమర్తి అనురాధా తదితరులు మాట్లాడుతూ… చంద్రబాబు పాలనకు ప్రతిరూపమని పొగిడారు. దీనిపై వైసీపీ సభ్యులు ఎప్పటికప్పుడూ మాటల దాడితో తిప్పికొట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ, గవర్నర్‌తో అసత్యాలు చెప్పించారని, నాలుగు లక్షల

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు