Monday, March 3, 2025
Homeవ్యాపారంసామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం16 5జీ, గెలాక్సీ ఎం06 5జీ విడుదల

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం16 5జీ, గెలాక్సీ ఎం06 5జీ విడుదల

గురుగ్రామ్‌ : భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ అయిన సామ్‌సంగ్‌, నేడు పలు విభాగాలలో అత్యున్నత ఫీచర్లతో రెండు మాన్‌స్టర్‌ పరికరాలైన గెలాక్సీ ఎం16 5జీ, గెలాక్సీ ఎం06 5జీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడిరచింది. అత్యంత ప్రజాదరణ పొందిన గెలాక్సీ ఎం సిరీస్‌కు తాజా చేర్పులు శైలి, అత్యాధునిక ఆవిష్కరణల ఆకట్టుకునే కలయికను అందిస్తాయి. ప్రతి వినియోగదారునికి కొత్త అవకాశాలను నిర్ధారిస్తాయి. గెలాక్సీ ఎం16 5జీ, గెలాక్సీ ఎం06 5జీలు ఎం సిరీస్‌ జంట వారసత్వాలు, పనితీరుతో వస్తాయి. వీటిలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, ఆపరేటర్ల వ్యాప్తంగా పూర్తి 5జీ మద్దతు ఉన్నాయి. గెలాక్సీ ఎం16 5జీ సెగ్మెంట్లో అత్యున్నత ఎఫ్‌హెచ్‌డీG సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే, ఆరుతరాల ఓఎస్‌ అప్‌గ్రేడ్‌లు, ట్యాప్‌ అండ్‌ పే ఫంక్షనాలిటీతో సామ్‌సంగ్‌ వాలెట్‌ పరిచయంతో కొత్త బెంచ్‌మార్క్‌ను కూడా నిర్దేశిస్తుందని సామ్‌సంగ్‌ ఇండియా ఎంఎక్స్‌ బిజినెస్‌ జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌ ఎస్‌ రావు అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు