గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, తాజాగా గెలాక్సీ ఏ06 5జిని విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇది సరసమైన ధరకు అద్భుతమైన 5జి అనుభవాన్ని అందిస్తుంది. అత్యంత సరసమైన బడ్జెట్‌లో గెలాక్సీ ఏ సిరీస్ 5జి స్మార్ట్‌ఫోన్‌గా, గెలాక్సీ ఏ06 5జి వినియోగదారులకు దాని విశ్వసనీయ పనితీరు, మన్నిక తో గరిష్ట విలువను అందించడానికి రూపొందింది. ఈరోజు నుండి, గెలాక్సీ ఏ06 5జి భారతదేశంలోని అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లలో, సామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో, అలాగే ఇతర ఆఫ్‌లైన్ ఛానెల్‌లలో, బహుళ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 64జిబి నిల్వతో 4జిబి రామ్ వేరియంట్ కేవలం రూ.10499 నుండి ప్రారంభ ధరతో గెలాక్సీ ఏ06 5జి మూడు సొగసైన, ఆకర్షణీయమైన రంగులు -నలుపు, బూడిద, లేత ఆకుపచ్చ-లో వస్తుంది.