నికోసియా: సైప్రస్‌లో బ్రిటిష్ వలసవాద పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలై 70 ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా అమర యోధులకు ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ (ఏకేఈఎల్) విప్లవాంజలి ఘటించింది. బ్రిటిష్ వలసవాద పాలనకు ముగింపు పలికే లక్ష్యంతో 1955, ఏప్రిల్ 1న పోరాటం ప్రారంభమైందని బుధవారం ఒక ప్రకటనలో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ గుర్తుచేసింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సైప్రస్ వీరులను కీర్తించింది. వీరోచితంగా, సాహసోపేతంగా తమ మాతృభూమి స్వాతంత్య్రం కోసం పోరాటి…ప్రాణాలు అర్పించిన యోధులకు జోహార్లు. ఎన్నో వేధింపులను తట్టుకున్నారని వలసవాద పాలకులకు వ్యతిరేకంగా పోరాడారంటూ శ్లాఘించింది. బ్రిటిష్ పాలన కాలాన్ని ఒక చీకటి శకంగా అభివర్ణించింది. నేటికీ సైప్రస్‌పై బ్రిటిష్ ఆధిపత్యం ఉందని తెలిపింది. దేశంలో బ్రిటిష్ స్థావరాలు ఏర్పాడ్డాయని, వాటిని ఇప్పుడు గాజాలో మారణహోమం సృష్టించడం కోసం యద్దేచ్ఛగా వాడుతున్నారని తెలిపింది. ఈ క్రమంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడం అత్యవసరమే కాదు సమయానుచితమని ఏకేఈఎల్ నొక్కిచెప్పింది.
సైప్రస్‌లో వలసవాద వ్యతిరేక పోరు మొదలై 70 ఏళ్లు
RELATED ARTICLES