ధర్మవరం: భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సిసిబి), తమ సమగ్ర సిఎస్ఆర్ విధానం, ప్రాజెక్ట్ షైన్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పలు కమ్యూనిటీ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలలో నీటి ఏటిఎం, రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఓ) ఫిల్టర్లు, కొత్త టాయిలెట్ సౌకర్యాలు, సమగ్ర నీటి లభ్యత, పారిశుధ్యం మరియు పరిశుభ్రత (వాష్) కార్యక్రమం ఏర్పాటు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి బ్లాక్, శివంపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్‌సిసిబి సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించారు.