. ఏ రూపంలోనూ హింస ఆమోదయోగ్యం కాదు
. ఉగ్రవాదంపై దాడిలో కలిసవస్తాం
. ‘పహల్గాం’ ఘటనపై ప్రపంచ దేశాల ఖండన
. భారత్‌కు సంఫీుభావం ప్రకటన
వాషింగ్టన్: జమ్మూకశ్మీర్, పహల్గాంలో ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిరచాయి. హింస అన్నది ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. అమాయకుల ప్రాణాలు తీయడం హేయం… అమానవీయం… అనాగరికం… భయానకరం అంటూ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. భారత్‌కు, బాధిత కుటుంబాలకు సంఫీుభావం ప్రకటించారు. ‘ఇది అనాగరికం… అమాయకులపై విచక్షణారహిత దాడి హేయం’ అని ఐక్య రాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. మృతులకు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఏ రూపంలోనూ పౌరులపై హింస జరగడం ఆమోదయోగ్యం కాదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పేర్కొంది. నేరపూరిత చర్యలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, భద్రతా, సుస్థిరతకు విఘాతం కలిగిస్తూ హింస, ఉగ్రవాదానికి పాల్పడే ఎలాంటి చర్యలైనా శాశ్వతంగా తిరస్కరించాలని యూఏఈ విదేశాంగ శాఖ నొక్కిచెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ దాడిని ఖండిరచారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసివున్నామని ట్రంప్ ప్రకటించారు. మృతులకు సంతాపం, బాధితుకులకు సానుభూతి తెలిపారు. భారత్ పర్యటనలో ఉన్న వాన్స్ స్పందిస్తూ విధ్వసంకర ఉగ్రదాడి బాధాకరమని అన్నారు. చైనా రాయబారి జు ఫీహాంగ్ ఒక ప్రకటనలో ‘భారత్‌లో ఉగ్రదాడి అమానవీయం… అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని వెల్లడిరచారు. శ్రీలంక విదేశాంగ శాఖ… ఉగ్ర దాడిని ఖండిస్తూ భారత్‌కు సానుభూతి ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసి వస్తామని వెల్లడిరచింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ పౌరుల మరణాలపై విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అంతానికి భారత్‌తో కలిసి ఇజ్రాయిల్ పనిచేస్తుందన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ ‘అమానవీయతను తీవ్రంగా ఖండిస్తున్నాం… బాధితులకు సానుభూతి తెలుపుతున్నాం’ అని వెల్లడిరచారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్‌కు సంఫీుభావం తెలిపారు. ‘ఈ ఘటన భయానకం… అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. హింస దృశ్యాలు కలచివేశాయి’ అని పేర్కొన్నారు.
భారత్‌లో ఉగ్రదాడి బాధాకరమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ‘ఉగ్రవాదంపై మా పోరాటం ఆగదు… భారత్‌లో ఉగ్ర దాడి జరగడం బాధాకరం’ అంటూ యూరోపియన్ యూనియన్ ప్రతినిధి కల్లాస్ వెల్లడిరచారు. ఈ కష్ట సమయంలో భారత్‌కు తోడుగా నిలుస్తామని జర్మనీ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బకాయీ స్పందిస్తూ ‘ఇది హేయమైన చర్య… ఘోరం… అంతర్జాతీయ `మానవతా చట్టాలు, నిబంధనల అతిక్రమణ’ అని పేర్కొన్నారు. ఏ రకమైన హింస ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రాదేశికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై పోరాటానికి కట్టుబడి ఉన్నట్లు ఇస్మాయిల్ ప్రకటించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని భారత్‌కు ఆయన సూచించారు. కాగా, ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ వెల్లడిరచారు. ‘ఏ రూపంలోనూ హింస ఆమోదయోగ్యం కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రదాడి వార్త కలచివేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలుపుతున్నాం’ అని అన్నారు.
‘అమాయకుల రక్తపాతం తీవ్ర బాధ కలిగిస్తుంది. ఇలాంటి హింస సమర్థనీయం కాదు. బాధాకర సమయంలో భారత్‌కు తోడుగా నిలుస్తాం’ అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సింబిహా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ స్పందిస్తూ ‘కశ్మీర్‌లో ఉగ్రవాదులు అమాయకుల రక్తాన్ని పారించారు. ఇది బాధాకరం. బాధితులకు సానుభూతి తెలుపున్నా’ అని వెల్లడిరచారు. ‘ఇలాంటి కర్కశత్వం, హింస ఆమోదయోగ్యం కాదు. దోషులను త్వరగా శిక్షించాలి’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.