అనంతపురం : దేశవ్యాప్తంగా సురక్షిత రైడిరగ్ అలవాట్లను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) అనంతపురంలోని పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ సాయి వెంకటేశ్వర ఐటీఐ%I% కళాశాలలలో ఒక ఇంటరాక్టివ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 2400 మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రోడ్ యూజర్లకు రహదారి భద్రత విద్యను సులభంగా, ప్రాయోగికంగా, సంబంధితంగా అందించడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ చేపట్టింది. యువతతో నేరుగా మమేకం కావడం ద్వారా వారి కుటుంబ సభ్యులు, సమాజం అంతటా సురక్షిత రైడిరగ్ అలవాట్లను అవలంబించేలా ప్రభావితం చేయవచ్చు. రోడ్ సేఫ్టీ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రమాదాలను ఊహించుకునే శిక్షణ, క్విజ్లు, గేమ్స్, హెల్మెట్ వినియోగంపై కార్యకలాపాలు, ఇతర యాక్టివిటీల ద్వారా విద్యార్థులలో చైతన్యం తీసుకువచ్చారు.