Friday, January 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి107 వ ఉచిత వైద్య చికిత్స శిబిరం..

107 వ ఉచిత వైద్య చికిత్స శిబిరం..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 107 వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బి. వెంకటరమణ, కోశాధికారి దాసరి వెంకటేశులు (చిట్టి), కార్యదర్శులు రాధాకృష్ణ, బండి నాగరాజు, మామిళ్ళ స్వతనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసమే ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, వృద్ధులు పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు. మందులను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ, కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశ్వర్లు, జ్ఞాపకార్థం కుమారుడు దాసరి రమాదేవి, దాసరి వెంకటేశులు వ్యవహరించడం జరుగుతోందని తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులు వివేక్ కుల్లాయప్ప, వెంకటేశ్వర్లు, సాయి స్వరూప్, సతీష్ కుమార్, జై దీపు నేత, విట్టల్ పాల్గొని రోగులకు వైద్య చికిత్సలు అందిస్తారని తెలిపారు. అంతేకాకుండా ప్రతినెలా 150 మందికి ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున ఆలయం కమిటీ ఆధ్వర్యంలో పింఛన్లు కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కావున ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరమును పేదలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు