Tuesday, May 13, 2025
Homeఅంతర్జాతీయం11 మంది సైనికుల మృతి

11 మంది సైనికుల మృతి

. 78 మందికి గాయాలు
. ప్రాణాలు కోల్పోయిన 40 మంది పౌరులు
. భారత్‌తో సైనిక ఘర్షణపై పాకిస్థాన్‌ ప్రకటన

ఇస్లామాబాద్‌: భారత్‌తో సాగిన భీకర పోరులో తమ సైనికులు 11 మంది చనిపోయారని పాకిస్థాన్‌ ప్రకటించింది. మరో 78 మందికి గాయాలు అయినట్లు మంగళవారం ఒక ప్రకటన చేసింది. అలాగే 40 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా 121 మంది గాయపడ్డారని వెల్లడిరచింది. ఈనెల 6,7 తేదీల మధ్య రాత్రి భారత్‌ భీకర దాడుల్లో ప్రాణ నష్టం సంభవించినట్లు అధికారి ప్రకటన పేర్కొంది. దాదాపు నాలుగు రోజులు సాగిన క్షిపణులు, డ్రోన్ల పరస్పర దాడుల అనంతరం శనివారం కాల్పుల విరవణ కోసం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సయోధ్య కుదిరిన విషయం తెలిసిందే. మాతృభూమిని రక్షించుకోవడం కోసం ప్రాణాలు త్యజించిన వీరసైనికుల్లో వైమానిక దళానికి చెందిన స్వాడ్రన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసుఫ్‌, చీఫ్‌ టెక్నీయన్‌ ఔరంగజేబ్‌, సీనియర్‌ టెక్నీషియన్లు ముబాషిర్‌, నజీబ్‌, కార్పొరల్‌ టెక్నీషియన్‌ ఫరూక్‌, నాయక్‌లు వకార్‌ ఖాలిద్‌, అబ్దుల్‌ రెహమాన్‌, లాన్స్‌ నాయక్‌లు దిలావర్‌ ఖాన్‌, ఇక్రాముల్లా, సిపాయిలు మహమ్మద్‌ అదీల్‌ అక్బర్‌, నిసార్‌ ఉన్నట్లు పేర్కొంది. దాడుల్లో చనిపోయిన సామాన్యుల్లో ఏడుగురు మహిళలు, 15 మంది పిల్లలు ఉన్నట్లు వెల్లడిరచింది. పాకిస్థాన్‌ సాయుధ దళాలు ‘మర్కా ఏ హక్‌’ బ్యానర్‌ కింద ఆపరేషన్‌ బున్యానున్‌ మర్సూలో ద్వారా ప్రతిదాడులు చేసినట్లు తెలిపింది. అమరులకు సాయుధ దళాలు, పాక్‌ పౌరులు సంయుక్తంగా నివాళులర్పించినట్లు ప్రకటన పేర్కొంది. పాకిస్థాన్‌ సార్వభౌమత్వాన్ని లేక ప్రాదేశిక సమగ్రతను సవాల్‌ చేస్తే దీటుగా బదులిస్తామని పాకిస్థాన్‌ స్పష్టంచేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు