Saturday, April 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 118వ బాబు జగజీవన్ రామ్ జయంతి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 118వ బాబు జగజీవన్ రామ్ జయంతి

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నందు శనివారం 118వ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇంచార్జ్ డి యం హెచ్ ఓ డా నారాయణస్వామి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వాతంత్రసమరయోధుడు , భారత దేశ మాజీ ఉపప్రధాన మంత్రి , తొలి దేశ కార్మిక శాఖ మంత్రి , పాకిస్థాన్ తో యుద్ధ సమయం లో రక్షణ శాఖ మంత్రిగా దేశ నికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కారక్రమంలో కార్యాలయం పరిపాలన అధికారి గిరిజా మనోహర్ రావు ,పీఎంఓ నాగన్న, సత్యనారాయణ హెచ్ ఈఓ ,శ్రీనివాసులు , విజయభాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు