–యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:12వ పి ఆర్ సి చెల్లింపుల కోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని, కనీసం 12వ పి ఆర్ సి పై కనీస ప్రస్తావన చేయకపోవడం పట్ల యుటిఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
2026 -27 బడ్జెట్లో ఉద్యోగులకు 11వందల కోట్ల బకాయిలు చెల్లించామని, కాగిత రహిత పెన్షన్ తీసుకురానున్నామని, ఈ హెచ్ ఎస్ కమిటీ వేశామని,మహిళలకు సెలవులు ఇచ్చామని గొప్పగా చెప్పారని, కానీ ఇంకా చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలకోసం ఎలాంటి నిధులు కేటాయింపు చేయలేదని విమర్శించారు.
12వ పిఆర్సి కమిషన్ చైర్మన్ నియామకం గురించి గానీ, దానికి సంబంధించిన నిధులు, నాలుగు డీఏ ల గురించి బడ్జెట్ లో కేటాయింపులుగాని ప్రసంగం లో ఎక్కడ ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని తెలిపారు.12వ పిఆర్సి చైర్మన్, నాలుగు డిఏలు, ఇతర బకాయిల చెల్లింపులపై ఈ బడ్జెట్ లో కేటాయింపు లేకపోతే మరో బడ్జెట్ వరకు ఎదురుచూడాల్సిందేనా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .12వ పిఆర్సి గడువు పూర్తయి సుమారుగా మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు చైర్మన్ నియామకం గురించి కూడా మాట్లాడకపోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని ,ఈ విషయం ప్రభుత్వం గమనించకపోతే భవిష్యత్తులో తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పాఠశాల విద్యా రంగానికి సంబంధించి 3,32, 325 కోట్ల బడ్జెట్ లో 32,308 కోట్లు అంటే 9.72 శాతం మాత్రమే కేటాయింపులు చేశారని ,గత సంవత్సరం బడ్జెట్ కంటే 0.14 శాతం తక్కువ కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వ విద్య పట్ల ప్రభుత్వానికి మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందని విమర్శించారు.ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి రాష్ట్ర బడ్జెట్లలో 30 శాతమునిధులు కేటాయించాలని కొఠారి చెప్పిన సిఫార్సులను ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు ఎలాంటి సారూప్యత లేకపోవడం పట్ల తీవ్ర నిరసన తెలియజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు కోసం కేటాయింపు నిధులు కూడా గతం కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పిఆర్సి చైర్మన్ నియమించాలని, నాలుగు డిఏలు, ఇతర బకాయిలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 20 శాతము నిధులు కేటాయించే విధంగా సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.
12వ పీఆర్సీ నిధుల ఊసే లేని బడ్జెట్
- Advertisement -
RELATED ARTICLES


