ముంబయి: భారతదేశపు మొదటి ఇంటిలిజెంట్ సీయూవీ ఎంజీ విండ్సర్ 15,000 యూనిట్ల మైలురాయి ఉత్పత్తిని దాటిందని జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా గురువారం ప్రకటించింది. సీయూవీ ఆరంభమైన నాటి నుండి వరుసగా నాలుగు నెలలు (అక్టోబర్ 2024- జనవరి 2025) బెస్ట్-సెల్లింగ్ ఈవీగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో ఈవీ విభాగం పూర్తి అభివృద్ధికి కూడా తోడ్పడిరది. ఈ సందర్భంగా, బిజు బాలేంద్రన్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మాట్లాడుతూ, మొత్తం ధరలు ప్యాకేజింగ్‌తో కారు బయ్యర్లు సీయూవీని విస్తృతంగా ఆదరించారని, బాస్, బైబ్యాక్ ప్రోగ్రాం, జీవిత కాలం వారంటీ వంటి స్మార్ట్ కార్యక్రమాలు ఈవీలలో వినియోగదారు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయన్నారు.