ఆర్డీవో రామ భూపాల్ రెడ్డి
విశాలాంధ్ర : ధర్మవరం – పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 17 దరఖాస్తులు రావడం జరిగిందని ఆర్డీవో రామ భూపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభాగాల వారీగా పరిశీలిస్తే రెవెన్యూ శాఖకు సంబంధించి 9 దరఖాస్తులు, సర్వే, సెటిల్మెంట్ & ల్యాండ్ రికార్డ్స్ శాఖకు 4 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 4 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు.మండలాల వారీగా ధర్మవరం మండలం నుంచి 6 దరఖాస్తులు, కనగానపల్లి నుంచి 5, తాడిమర్రి నుంచి 3, బత్తలపల్లి నుంచి 1, చెన్నేకొత్తపల్లి నుంచి 1, ముదిగుబ్బ నుంచి 1 దరఖాస్తు అందాయి అని తెలిపారు. రామగిరి మండలం నుంచి ఎటువంటి దరఖాస్తులు అందలేదు అని తెలిపారు.ప్రజల నుంచి అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 17 దరఖాస్తులు
- Advertisement -


