. 2022సీతారామం... 2021
ఆర్‌ఆర్‌ఆర్
. 2014 నుంచి పదేళ్లకు గద్దర్ అవార్డుల ప్రకటన
. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు
. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు
. యండమూరి సహా మరో ఐదుగురికి ప్రత్యేక అవార్డులు
విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ సినీనటుడు, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజుతో కలిసి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అవార్డుల వివరాలను వెల్లడిరచారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడిరచారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాకవి, దివంగత కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు.
సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలు:
2014: ప్రథమ ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్, రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల, మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను. 2015: ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి, రెండో ఉత్తమ చిత్రం: కంచె, మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు
2016: ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి, రెండో ఉత్తమ చిత్రం: పెళ్ళి చూపులు, మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్
2017: ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2, రెండో ఉత్తమ చిత్రం: ఫిదా, మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ
2018: ప్రథమ ఉత్తమ చిత్రం: మహానటి, రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం, మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం
2019: ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి, రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ, మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం
2020: ప్రథమ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో, రెండో ఉత్తమ చిత్రం: కలర్ ఫొటో, మూడో ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలొడీస్
2021: ప్రథమ ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్, రెండో ఉత్తమ చిత్రం: అఖండ, మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన
2022: ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం, రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2, మూడో ఉత్తమ చిత్రం: మేజర్
2023: ప్రథమ ఉత్తమ చిత్రం: బలగం. రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్, మూడో ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఆరు ప్రత్యేక అవార్డులివే:
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ, పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: మణిరత్నం, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్ .
బాలయ్య హర్షం
గద్దర్ సినీ పురస్కారాల్లో భాగంగా తనకు ఎన్‌టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడంపై ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎంతో ప్రత్యేకమైన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి తాను ఎంపిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తిచేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు, ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నా తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపకుంటున్నానని బాలకృష్ణ వెల్లడిరచారు.