Thursday, February 20, 2025
Homeవ్యాపారం2024లో 1.57 లక్షల ప్రీ-ఓన్డ్‌ కార్లను విక్రయించిన హ్యుందాయ్‌ ప్రామిస్‌

2024లో 1.57 లక్షల ప్రీ-ఓన్డ్‌ కార్లను విక్రయించిన హ్యుందాయ్‌ ప్రామిస్‌

గురుగ్రామ్‌: హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) దాని ప్రీ-ఓన్డ్‌ కార్‌ ప్రోగ్రామ్‌ – హ్యుందాయ్‌ ప్రామిస్‌ ద్వారా, సీవై (ప్రస్తుత సంవత్సరం) 2024లో దాని అత్యధిక వార్షిక అమ్మకాలను సాధించింది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 5.8% వృద్ధితో 1,57,503 ప్రీ-ఓన్డ్‌ కార్లను ఇది విక్రయించింది. కస్టమర్ల విశ్వాసం, విలువను బలోపేతం చేస్తూ, హ్యుందాయ్‌ ప్రామిస్‌ 35,553 సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ కార్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది దాని మొత్తం వాల్యూమ్‌కు 23% తోడ్పడిరది. ఇది 8% ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్‌లో కొత్త ప్రమాణాన్ని హ్యుందాయ్‌ ప్రామిస్‌ నెలకొల్పింది. సీవై 2024లో దాని అత్యధిక ఎక్స్ఛేంజ్‌ అవుట్‌రీచ్‌ 20.4%ని సాధించింది. 2024లో హ్యుందాయ్‌ ప్రామిస్‌ సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ కార్ల అమ్మకాలలో, హ్యుందాయ్‌ ఐ20, క్రెటా, గ్రాండ్‌ ఐ 10 అమ్మకాలలో ఆధిపత్యం చెలాయించింది, మొత్తం వాల్యూమ్‌లలో 55% వాటా వీటిదే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు