Friday, February 21, 2025
Homeఅంతర్జాతీయం23న జర్మనీ ఎన్నికలు

23న జర్మనీ ఎన్నికలు

. చాన్సలర్‌ రేసులో ఆ నలుగురు
. మళ్లీ బరిలో నిలిచిన ఓలాఫ్‌
. మహిళా అభ్యర్థికి మస్క్‌ మద్దతు

బెర్లిన్‌: కొత్త ఛాన్సలర్‌ను ఎన్నుకునేం దుకు జర్మనీ సిద్ధమైంది. పోలింగ్‌ ఆదివారం జరగనుంది. గతేడది చివరిలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన క్రమంలో ముందస్తు ఎన్నికలను చాన్సలర్‌ ఒలాఫ్‌ స్కాల్జ్‌ ప్రకటిం చారు. యూరోప్‌లోని అత్యంత ప్రభావిత దేశంతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ భవిష్యత్‌ ఆధారపడి ఉండటంతో ప్రస్తుత ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడిరది. ఓలాఫ్‌ రెండోసారి పోటీ చేస్తున్నారు. ఆయనకు విపక్ష అభ్యర్థి ఫెడ్రిక్‌ మెర్జ్‌తో పాటు ప్రస్తుత వైస్‌ ఛాన్సలర్‌ రాబర్ట్‌ హెబెక్‌, ఫార్‌రైట్‌ పార్టీ నాయకురాలు ఆలిస్‌ వైడెల్‌ నుంచి గట్టి పోటీ ఎదరవుతోంది. ఆలిస్‌ వైడెల్‌కు ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ మద్దతు ఇవ్వడంతో ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒలాఫ్‌ (66) సోషల్‌ డెమొక్రాట్‌. 2021 డిసెంబరు నుంచి జర్మనీకి చాన్సలర్‌గా ఉన్నారు. గతంలో హాంబర్గ్‌ మేయర్‌గా, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాగే ఫెడ్రిక్‌ మెర్జ్‌ (69) ప్రతిపక్షసెంటర్‌ రైట్‌ యూనియన్‌ బ్లాక్‌ అభ్యర్థి. పూర్వ ప్రత్యర్థి, సుదీర్ఘ కాలం చాన్సలర్‌గా పనిచేసిన ఏంజిలా మెర్కెల్‌ 2021లో తప్పుకున్న తర్వాత క్రిస్టియన్‌ డెమొక్రటిక్‌ యూనియన్‌ పార్టీ నాయకుడిగా మెర్జ్‌ ఎదిగారు. రాబర్ట్‌ హెబెక్‌ (55) గ్రీన్స్‌ అభ్యర్థి. ప్రస్తుతం జర్మనీకి వైస్‌ చాన్సలర్‌గా, ఆర్థిక`పర్యావరణ మంత్రిగా ఉన్నారు. ఏకైక మహిళా అభ్యర్థి ఆలిస్‌ వైడెల్‌ (46) తొలిసారి చాన్సలర్‌ రేసులో నిలిచారు. ఆమె ఏఎఫ్‌డీ అభ్యర్థి. డిసెంబరులో నామినేట్‌ అయ్యారు. ఆమెకు మస్క్‌ మద్దతు ప్రకటిం చారు. ఈనెల 23వ తేదీన పోలింగ్‌ జరగ బోతోంది. అయితే ఫలితాల రావడానికి సమయం పడుతుందని, ఎగ్జిట్‌ పోల్స్‌ ఆధారంగా ఆదివారం సాయంత్రంలోగా రావచ్చని తెలుస్తోంది. పోస్టల్‌ ఓట్ల లెక్కింపునకు సమయం పడుతుంది కాబట్టి పూర్తిస్థాయి ఫలితాలు కాస్త ఆలశ్యంగా వెలువడతాయని సమాచారం. మరోవైపు చిన్న పార్టీల ప్రదర్శనతో పోలింగ్‌ ప్రభావితం అవుతుందన్న అంచనా ఉంది. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు వెంటనే జరగబోదు. సంకీర్ణం ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి కొన్ని నెలలు పట్టవచ్చు. అయితే జర్మనీలో రాజకీయం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఏక పార్టీ పాలన కష్టసాధ్యం కాబట్టే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి. ఇదిలాఉంటే, సోషల్‌ డెమొక్రాట్స్‌ (ఎస్‌పీడీ), విపక్ష కన్జెర్వేటివ్స్‌, క్రిస్టియన్‌ డెమొక్రాట్స్‌ (సీడీయూ), బవారియన్‌ సోదరి పార్టీ ది క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ (సీఎస్‌యూ), ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ (ఏఎఫ్‌డీ), గ్రీన్స్‌ మధ్య ప్రస్తుతం హోరాహోరీ నెలకొంది. ఫ్రీ డెమొక్రాట్స్‌ (ఎఫ్‌డీపీ), లింకె, లెఫ్టిస్ట్‌ సహ్రా వాంగ్‌క్నెచ్‌ అలయన్స్‌ (బీఎస్‌డబ్ల్యూ) కూడా బరిలో నిలిచాయి. వాస్తవానికి రెండేళ్లుగా కన్జర్వేటివ్‌ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈనెల 16న వెలువడిన ఫోర్సా ఇన్‌స్టిట్యూట్‌ సర్వే నివేదిక ప్రకారం ఈ పార్టీకి 30శాతం, ఏఎఫ్‌డీకి 20శాతం, ఎస్‌డీపీకి 16శాతం చొప్పుణ మద్దతు లభించినట్లు వెల్లడైంది. గ్రీన్స్‌కు 13శాతం, లింకెకు ఏడు శాతం, ఎఫ్‌డీపీకి ఐదు శాతం, బీఎస్‌డబ్ల్యూకు నాలుగు శాతం చొప్పున మద్దతున్నట్లు నివేదిక పేర్కొంది. పోలింగ్‌ ధోరణి మారవచ్చని, ఓటర్లు ఒక పార్టీకి కట్టుబడే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అన్నారు. 2021 ఎన్నికలప్పుడు కన్జర్వేటివ్‌లు రాణించారు కానీ విజయం వరించలేదన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు