Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజనసేన పార్టీలోకి 300 మంది కుటుంబాలు చేరికలు

జనసేన పార్టీలోకి 300 మంది కుటుంబాలు చేరికలు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో 300 మంది కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వారిని ఆహ్వానిస్తూ, పార్టీ కండువా కప్పి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. డబ్బులు వాయిద్యాలతో పూలవర్షం ను 28వ వార్డు ప్రజలు కురిపించారు. జనసేనలో చేరిన వారు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చిలక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన చేరడం జరిగిందని తెలిపారు. ఈ చేరికలు జనసేన పార్టీ వార్డు ఇన్చార్జ్ సరితల భాష ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ ఆపద వచ్చినా ముందు ఉంటానని వారు స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు