Home48 గంటల్లో రాజీనామా

48 గంటల్లో రాజీనామా

- Advertisement -

జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ డెడ్లైన్ ` కాదంటే దేశవ్యాప్త ఆందోళనలు: దీప్కే

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయా లని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాప కుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. ఇందుకోసం 48 గంటల డెడ్లైన్ విధించారు. కాదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలన్నీ ఆపాలని కూడా డిమాండ్ చేశారు. దీప్కే గురువారం న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఈసీ రాజీనామా చేయక పోతే దేశ రాజధానితో పాటు యావత్ దేశం ధర్నాలు, నిరసనల కార్యక్రమాలతో హోరెత్తుతుందని స్పష్టం చేశారు. అదే క్రమంలో సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ సీఈసీ గా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడంతో పాటు ఆయనకు ఆదేశాలిచ్చినట్లు ఆరోపణలు ఉన్న అందరిపై క్రిమినల్ చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్‌ను 2025 నాటి ఓటర్ల జాబితా స్థితికి తీసుకెళ్లాలన్నారు. సంబంధిత ఫైళ్లను సుప్రీంకోర్టు నేతృత్వ కమిటీ అధీనంలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్‌ల నియామకానికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేయాలని కూడా సీజేపీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషనర్‌లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో 14 సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు, చర్యలపై అభ్యంతరాలు తెలిపారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెలువరించడం రాజకీయంగా దుమారం రేపింది. ఎన్నికల సంఘం దీనిని కొట్టిపారేసినప్పటికీ ఎస్‌ఐఆర్ సహా అన్ని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకొని, బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌కు కీలుబొమ్మగా సీఈసీ ప్రవర్తించినట్లు ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు