Monday, March 3, 2025
Homeవ్యాపారం7న లయన్స్‌గేట్‌ ప్లేలో తెలుగు సైన్స్‌ ఫిక్షన్‌ రొమాన్స్‌ ‘రివైండ్‌’

7న లయన్స్‌గేట్‌ ప్లేలో తెలుగు సైన్స్‌ ఫిక్షన్‌ రొమాన్స్‌ ‘రివైండ్‌’

ముంబయి : మార్చి 7న ప్రముఖ ఓటీటీ లయన్స్‌గేట్‌ ప్లేలో ప్రత్యేకంగా తెలుగు, హిందీ రెండిరటిలోనూ ప్రసారం కానున్న, ఉత్కంఠ రేకెత్తించే తెలుగు సైన్స్‌ ఫిక్షన్‌ రొమాన్స్‌ ‘రివైండ్‌’తో ప్రేమ, కోల్పోవడం, రెండవ అవకాశాలతో మరపురాని చక్కని భావోద్వేగాల ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండాలని ఆ సంస్థ కోరుతోంది. క్రాస్‌వైర్‌ క్రియేషన్స్‌ నిర్మించిన కళ్యాణ్‌ చక్రవర్తి దర్శకత్వం వహించిన, సాయి రోనక్‌, అమృత చౌదరి నటించిన ఈ మనస్సును కదిలించే టైమ్‌ ట్రావెల్‌ అడ్వెంచర్‌ మనలో చాలా మంది ఆశ్చర్యపోయే ప్రశ్నను అన్వేషిస్తుంది. భవిష్యత్తును పరిష్కరించేందుకు మీరు నిజంగా గతాన్ని మార్చగలరా?. ఈ ఆధునిక ప్రేమకథ కార్తీక్‌ (సాయి రోనక్‌) అనే యువ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, శాంతి (అమృత చౌదరి)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. చివరకు ఏం జరిగిందనే అంశంతో కథ ఆసక్తికరంగా సాగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు