Homeజిల్లాలుఅనంతపురంముగిసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలు

ముగిసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం : 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించినట్లు భారత సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ముగింపు సమావేశానికి నా కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కస్తూరీ/ ఆర్.ఆర్. కాలేజి ఆఫ్ ఫిజియోథెరపీ, అనంతపురము ప్రొఫెసర్ డాక్టర్ బత్తలపల్లి సత్య రంగా రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సహకార వారోత్సవాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ రోజు అంశములో భాగంగా గ్లోబలైజేషన్, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు, వ్యాపార రంగంలో అద్భుతమైన మార్పులను రావడం జరిగిందన్నారు. జిల్లా సహకార అధికారి ఎం.బి. మురళీమోహన్ మాట్లాడుతూ… సహకార రంగం కేవలం వ్యవసాయం లేదా గ్రామీణ రంగానికే పరిమితం కాకుండా ఫిన్లాక్, ఇ-కామర్స్, హెల్త్కేర్, లాజిస్టిక్స్ వంటి కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తోందని. ఇవి క్లౌడ్ ఆధారంగా అకౌంటింగ్ ఆన్లైన్ మెంబర్ పోర్టల్స్ ఏ.ఐ ఆధారిత ఫైనాన్షియల్ విశ్లేషణ బ్లాక్ చెయిన్ ఆధారిత లావాదేవీలు ఇవి పారదర్శకత, జవాబుదారితనం, త్వరిత నిర్ణయ సామర్ధ్యాన్ని పెంచుతున్నాయన్నారు. అనంతరం హాజరైన శిక్షణార్థులతో కలిసి సహకార ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఎం & సి.ఏ శిక్షణార్థులు, సహకార శాఖ అధికారులు, వివిద సహకార సంఘాల సి.ఇ.ఓలు, శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు