Friday, February 21, 2025
Homeవ్యాపారం783 మంది విద్యార్థులకు రూ.3.38 కోట్ల హ్యుందాయ్‌ హోప్‌ స్కాలర్‌షిప్‌

783 మంది విద్యార్థులకు రూ.3.38 కోట్ల హ్యుందాయ్‌ హోప్‌ స్కాలర్‌షిప్‌

న్యూదిల్లీ: హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) సీఎస్‌ఆర్‌ విభాగం అయిన హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ (హెచ్‌ఎంఐఎఫ్‌), దాని హ్యుందాయ్‌ హోప్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కింద రూ.3.38 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడిరచింది. ఆగస్టు 2024లో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల నుండి వచ్చిన అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా సమీక్షించింది. ఇప్పుడు వెనుకబడిన సామాజిక-ఆర్థిక నేపథ్యాల కు చెందిన 783 మంది ప్రతిభావంతులైన మరియు అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేసింది. ఈ యువ విద్యార్థులలో కేంద్ర మరియు రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు, కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ కోసం సిద్ధమవుతున్న 440 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరితో పాటు వివిధ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) క్యాంపస్‌ల నుండి 100 వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 343 మంది విద్యార్థులు సమాజం, పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే వినూత్న ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు