విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో1990-93 సంవత్సరాల మధ్య డిగ్రీ చదివిన పూర్వపు విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఉరవకొండలో సమ్మేళనం నిర్వహించారు. చదువు పూర్తయిన 31 సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు.
అదేవిధంగా ప్రస్తుతం చేస్తున్న వ్యాపార, ఉద్యోగ తదితర వివరాలతో పాటు కుటుంబ వివరాలను సైతం ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు రఘురాములు, గౌస్, అరవింద్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థులు కలయిక
RELATED ARTICLES