అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యము అని అధ్యక్షులు జై సింహా కార్యదర్శి నాగభూషణ కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఆవరణములో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి నారాయణప్ప జ్ఞాపకార్థం సతీమణి దాసరి బసమ్మ, కోడలు దాసరి లక్ష్మీదేవమ్మా, కుమారుడు దాసరి రామచంద్ర వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఈ శిబిరానికి 197 మంది కంటి రోగులు రాగా,165 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందన్నారు. వీరందరిని 16వ తేదీ 18వ తేదీ లలో శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరులో ఉచిత రవాణా, ఉచిత వసతి, ఉచిత భోజనం, ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు, శంకర కంటి ఆసుపత్రి డాక్టర్ అనురాధ లను ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, కొండయ్య, శివయ్య, రత్నశేఖర్ రెడ్డి, మనోహర్ గుప్తా, రమేష్ బాబు, బండారు చలం, తిరుమల దాస్, సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్, రిటైర్డ్ టీచర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం..
RELATED ARTICLES