Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

హైదరాబాద్‌లో వర్షాలు


అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
గులాబ్‌ తుఫాను ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతున్నది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌, అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంటలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నది.హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, మేడిపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, బాచుపల్లిలో వాన పడుతోంది. తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించింది. అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది.హైదరాబాద్‌లో ఇద్దరు అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. బాధితులు ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే స్పందించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img