Wednesday, April 16, 2025
Homeజిల్లాలువిజయనగరంనవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం

నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం

విశాలాంధ్ర- సంతకవిటి/రాజాం (.విజయనగరం జిల్లా) : సంతకవిటి మండలం గోవిందపురం పంచాయతీ ప్రకృతి వ్యవసాయ విభాగం మాస్టర్ ట్రైనర్ బి.పద్మ యూనిట్ ఇన్చార్జి పాత్రుని వెంకటరమణ గ్రామ సర్పంచు రాగోల రమేష్,, పంచాయతీ సెక్రెటరీ రామారావు గ్రామ పెద్దలు రైతులు ఈ గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులు నవధాన్యాలు విత్తనాలు 12 కేజీలు పప్పు దినుసులు చిరుధాన్యాలు పచ్చిరొట్ట విత్తనాలు ఆకుకూరలు,కూరగాయలు ఒక ఎకరాకు 12 కేజీలు చొప్పున ఖరీఫ్లో వేసుకుంటే 45 రోజుల తర్వాత కలియ దున్నుకోవాలి వీటివలన నేల సారవంతం పెరుగుతుంది. పంటకు కావలసిన సూక్ష్మ స్థూల పోషకాలు లభిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకుంటుంది రైతులకు రసాయని వ్యవసాయానికి బదులు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన పెట్టుబడులు తగ్గి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటు నేలతల ఆరోగ్యాన్ని కాపాడుకొని భవిష్యత్తు తరాల వారికి అందించడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులైన ఘనజీవమృతం, బీజమృతం, ద్రవ జీవమృతము, నియమాస్త్రము మొదలైనవి రైతులు పాటిస్తే పెట్టుబడులు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది అని వివరించారు.
గోవిందపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు