విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పలుచోట్ల అంబేద్కర్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ కే హెచ్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్, రాజనీతి శాస్త్ర విభాగం గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. దేశం కోసం ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు అని తెలిపారు. అనంతరం క్విజ్ పోటీలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ, అధ్యాపకులు, బోధ నేతల సిబ్బంది పాల్గొన్నారు.
ఎం ఎం డి ఏ ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు దాదా పీర్ సభ్యులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ జయంతి వేడుకలను జరుపుకున్నారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జిక్రియ, రహమతుల్లా, ఆనంద్, నారాయణ, నమ్మి ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ లాయర్ సుమలత, నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, లాయర్ విజయ రాఘవేంద్ర అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ టీం సభ్యులు పాల్గొన్నారు.
సమాచార హక్కు రాష్ట్ర కన్వీనర్ హబీబ్ రహిమాన్ జిల్లా అధ్యక్షుడు సునీల్ జిల్లా ఉపాధ్యక్షుడు పోతులయ్య డివిజన్ కమిటీ షేక్ అయాజ్ పట్టణ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఖాసీం ఉపాధ్యక్షులు చింత శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొని, అంబేద్కర్ విగ్రహానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కోలమరం చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరూ కూడా అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు.
యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షులు జయ చంద్రారెడ్డి, సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ అన్ని వర్గాలకు చెందిన జాతీయ నాయకుడని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జోన్ నాయకులు రామకృష్ణ నాయక్ ,ఆంజనేయులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మజ్జిగను పంపిణీ చేశారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడుతూ వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.