శ్రీ షిరిడి సాయి సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు సత్యసాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో నూతనంగా శివాలయం ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఈ ఆలయ నిర్మాణం పట్ల పలువురు దాతలు ఆలయానికి తమ సహాయ సహకారాలలో భాగంగా భక్తిగా, భక్తులుగా విరాళాలని ఇస్తున్నారు. ఇందులో భాగంగా శివాలయ నిర్మాణమునకు మాగులూరు కృష్ణమోహన్, భార్య సు ప్రసన్న దంపతులు తమ వంతుగా 50వేల రూపాయలను విరాళంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వీరనారాయణ ,కార్యదర్శి రామలింగయ్య, డైరెక్టర్ సూర్య ప్రకాష్ కు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ వారు దంపతుల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, వారిని ఘనంగా సత్కరించారు.
శివాలయ నిర్మాణమునకు కృష్ణమోహన్ దంపతులు విరాళం..
RELATED ARTICLES