Tuesday, April 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివైయస్సార్ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శిగా సురేష్ రెడ్డి ఎంపిక

వైయస్సార్ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శిగా సురేష్ రెడ్డి ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అప్పి రెడ్డి గారి సురేష్ రెడ్డి ను పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సురేష్ రెడ్డికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తారని, పార్టీ అభివృద్ధికి పాటుపడతారని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు