విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : ఫైర్ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రాజాం పట్టణ పరిధి డోలపేట పరిసర ప్రాంతాలలో నివాస ప్రాంతాలలో, పలు అపార్ట్మెంట్ల వద్ద ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఎల్పిజి సిలిండర్లు, దీపాలు వెలిగించే ప్రమిదలు వీటివల్ల జరిగే అగ్ని ప్రమాదాలకు ముందస్తు చర్యలుగా పాటించవలసిన జాగ్రత్తలపై కరపత్రాలు పంచుతూ వాడవాడలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఎస్.ఎఫ్.ఓ. జనార్ధనరావు, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.