విశాలాంధ్ర- సంతకవిటి/రాజాం (విజయనగరం జిల్లా) : సంతకవిటి మండలం లోని బొద్దూరు గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర, బొద్దూరు ఎంపీటీసీ వల్లూరు గణేష్ హాజరయ్యారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ రక్తదానం ఒకరికి ప్రాణం ఇవ్వటం లాంటిదని సీఐ అభిప్రాయపడ్డారు. ఎంతో అభినందనీయమైన ఈ కార్యక్రమం నిరంతరం జరిగితే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారవుతారని తెలిపారు.ఎంపీటీసీ వల్లూరు గణేష్ మాట్లాడుతూ ముఖ్యంగా యువత అపోహలు మాని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. గ్రామం లోని యువత సామాజిక కార్యక్రమాల్లో ముందు ఉండడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ఎంపీటీసీ గణేష్ పుస్తకాలను పంపిణీ చేసారు. అనంతరం పాఠశాల ఆవరణలో సీఐ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం లో రెడ్క్రాస్ ప్రతినిధులు కొత్తా సాయి, పెంకి చైతన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరరావు,ఈశ్వరరావు,ఉపాధ్యాయులు, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.